"నవోదయ పరీక్ష కేంద్రాలు పరిశీలించిన గన్నవరం ఎం.ఈ.ఓ కొండా రవికుమార్"  ఆర్ జే 7 న్యూస్ గన్నవరం  :-  నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం  బాలుర ఉన్నత పాఠశాల  మరియు బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నాడు జరుగునున్న నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాలను శుక్రవారం నాడు గన్నవరం మండల విద్యాశాఖ అధికారి కొండా రవికుమార్ పరిశీలించారు. ఆరు మండలాల నుంచి   బాలుర ఉన్నత పాఠశాలలో 11 గదులలో 24 మంది విద్యార్థులు చొప్పున 263 మంది , బాలికల ఉన్నత పాఠశాలలో 12 గదులలో 24 మంది విద్యార్థులకు చొప్పున 288 విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు.  విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా నిర్వహణ అధికారిగా గొట్టం వెంకట రవిబాబు,  బాలికల ఉన్నత పాఠశాల నిర్వహణ అధికారిగా ఝాన్సీ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ  పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని సూచించారు.
*జాతీయ పవర్ లిప్టింగ్ పోటీలకు అశ్విన్, శ్రావణ్ లక్ష్మి ఎంపిక* ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:-  జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు గన్నవరం మండలం కేసరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అశ్విన్, శ్రావణ్ లక్ష్మి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తోట నరేష్ శుక్రవారం తెలిపారు వీరు జనవరి 19 నుండి 22వ తేదీ వరకు ఛతిష్ ఘడ్ లో జరగబోయే జాతీయ పోటీలలో పాల్గొంటారన్నారు ఈ సందర్భంగా *విద్యార్థులను పీడి శ్రీదేవి ని* రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ సంఘం అధ్యక్షులు మహేష్ కార్యదర్శి దినేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం క్రీడలను ఆడటం వలన మానసికంగా ఆరోగ్యం గాను శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని అన్నారు ఎంపికైన విద్యార్థులను కేసరపల్లి సర్పంచ్ కుమారి చేబ్రోలు లక్ష్మి మౌనిక, పొట్లూరి బసవరావు ప్రత్యేకంగా అభినందించారు.

View The Recent Blog

Here you will find all of the most recent trending information.

f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">