ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:- గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి 10 గంటలకు గన్నవరం విమానశ్రయం చేరుకున్నారు. హైదరాబాదు నుండి చేరుకున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో వడ్రాన హరిబాబు, బచ్చుల బోసు బాబు, నాదెండ్ల బ్రహ్మ చౌదరి ,బుస్సే నాగప్రసాద్, పొదిలి లలిత, మేడేపల్లి రమ, జనసేన నాయకులు చిమట రవి వర్మ, బిజెపి నాయకులు అన్నపురెడ్డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.