"నవోదయ పరీక్ష కేంద్రాలు పరిశీలించిన గన్నవరం ఎం.ఈ.ఓ కొండా రవికుమార్" ఆర్ జే 7 న్యూస్ గన్నవరం :- నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నాడు జరుగునున్న నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాలను శుక్రవారం నాడు గన్నవరం మండల విద్యాశాఖ అధికారి కొండా రవికుమార్ పరిశీలించారు. ఆరు మండలాల నుంచి బాలుర ఉన్నత పాఠశాలలో 11 గదులలో 24 మంది విద్యార్థులు చొప్పున 263 మంది , బాలికల ఉన్నత పాఠశాలలో 12 గదులలో 24 మంది విద్యార్థులకు చొప్పున 288 విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా నిర్వహణ అధికారిగా గొట్టం వెంకట రవిబాబు, బాలికల ఉన్నత పాఠశాల నిర్వహణ అధికారిగా ఝాన్సీ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని సూచించారు.