"జాతీయస్థాయి కురష్ పోటీలకు చిన్మయి ఎంపిక " ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:- రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 16 ,17 తేదీల్లో కడప జిల్లా కోడూరులో జరిగిన కురష్ గేమ్ లో అండర్ 17,63 ప్లస్ విభాగంలో గన్నవరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న మానికొండ సాయి సత్య చిన్మయి బంగారు పతకం సాధించింది. ఆటలో ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన చిన్మయి జాతీయస్థాయి కురష్ పోటీలకు ఎంపికయింది. జనవరి 2వ తేదీ నుంచి చతీష్గడ్ రాష్ట్రం రాయపూర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు కృష్ణాజిల్లా నుంచి ఎంపికైన ఏకైక బాలిక మానికొండ సాయి సత్య చిన్మయి. చదువుతోపాటు క్రీడల్లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్మయిని పలువురు అభినందించారు.