"రాష్ట్ర స్థాయి 'పారా ఫెన్సింగ్' లో స్ఫూర్తి కి పసిడి పతకం" రాష్ట్ర స్థాయి పారా ఫెన్సింగ్ (దివ్యాంగుల కత్తి సాము) లో స్ఫూర్తి పసిడి పతకం కైవసం చేసుకుందని ఫెన్సింగ్ శిక్షకులు, గన్నవరం వ్యాయామ విద్య సహాయకులు ధనియాల నాగరాజు పత్రికలకు తెలిపారు. గన్నవరం హైస్కూల్ ప్లస్ లో ప్రధమ సంవత్సరం ఇంటర్ చదువుతున్న ఆమె ఆదివారం నాడు నంద్యాల క్రీడాప్రాధికార సంస్థలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు హాజరై క్రీడా నైపుణ్యం ప్రదర్శించడంతో ఫోయిల్ క్రీడాశం నందు పసిడి పతకం ఛేజిక్కించు కున్నట్లు నాగరాజు తెలిపారు. చెన్నై లో త్వరలో జరుగబోయే జాతీయస్థాయి పోటీలకు స్ఫూర్తి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. స్ఫూర్తి బంగారు పతకం సాధించి, జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైనందుకు స్ఫూర్తిని ఆమెకు అతి తక్కువ సమయం లోనే శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన వ్యాయామ విద్య సహాయకులు నాగరాజు ను హై స్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ జి.వి రవి బాబు మరియు కళాశాల, పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యయేతర సిబ్బంది అభినందించారు. స్ఫూర్తి భవిష్యత్ క్రీడా రంగంలో మరింత రాణించాలని వారు ఆశీర్వదించారు.కాగా గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల లో పని చేస్తున్న కొండలరావు (గణిత ఉపాధ్యాయులు) కుమార్తె స్ఫూర్తి కావడం విశేషం.

RJ7 MEDIA
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">