ఆర్ జె 7 న్యూస్ కృష్ణాజిల్లా :- కృష్ణాజిల్లా మోడరన్ పెంటతిలిన్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. ఈ మేరకు ఆదివారం నాడు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోని వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యవర్గం ఏకగ్రీవం అయింది. అధ్యక్షులుగా వెలగపూడి ఉజ్వల్, కార్యదర్శిగా మరీదు నరేంద్రబాబు, కోశాధికారిగా పలగాని సాయికుమార్, ఉపాధ్యక్షులుగా కె కృష్ణమోహన్, సంయుక్త కార్యదర్శిగా జి విజయకుమార్, కార్యవర్గ సభ్యులుగా కే టాన్యగిరి, ఎస్.కె గౌస్యానిని,సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మోడ్రన్ పెంటతిలిన్ అసోసియేషన్ కార్యనిర్వాహకదర్శి కృష్ణ హాజరయ్యారు. అలాగే అంతర్జాతీయ మోడరన్ పెంటతిలిన్ శిక్షకులు సాంబశివరావు (పోలీస్) హాజరయ్యారు. కృష్ణాజిల్లాలో మోడ్రన్ పెంటతిలిన్ ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు జిల్లా సంఘం కృషి చేయాలని ఈ సందర్భంగా కృష్ణయ్య కోరారు. గ్రామీణ ప్రాంతంలోని ఉత్తమ క్రీడాకారులనే లక్ష్యంగా తీసుకొని జాతికి అందించేందుకు కృషి చేస్తామని అధ్యక్ష కార్యదర్శులు ఉజ్వల్, నరేంద్ర తెలిపారు.