Date: 22-05-2025 పాపులమ్మ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్దుల (1987-1992) సహకారంతో చలివేంద్రము లో మజ్జిగ, పులిహోర పంపిణీ మైలవరం మండలం వెల్వడం శ్రీమతి లకిరెడ్డి పాపులమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 1987-1992 సంవత్సరాలలో 6 నుండి 10 వతరగతివరకు చదువుకొన్న పూర్వపు విద్యార్దుల సంఘం సహకారముతో వెల్వడం మెయిన్ సెంటర్ కచేరి చావిడి నందు గత రెండు నెలలకు పైగా నిర్వహిస్తున్న కూలింగ్ మంచి నీటి చలివేంద్రం వద్ద ఈ రోజు ది: 22-05-2025న హనుమ జయంతి ని పురస్కరించుకొని ఉదయం 10గంటల నుండి ఒంటిగంట వరకు మజ్జిగ, పులిహోర పంపిణీ చేయడం జరిగింది. బొగ్గుల వెంకటేశ్వర రెడ్డి (తోలుకోడు కండక్టర్ గారు) జ్ఞాపకార్ధం వారి ద్వితీయ కుమారుడు బొగ్గుల వెంకట శ్రీనివాస రెడ్డి (USA) వారి ధర్మపత్ని కృష్ణ వేణి (USA) సహకారం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విద్యార్ధి సంఘం నాయకులు గూడూరు నాగి రెడ్డి తెలిపారు. సుమారు 1000 మంది కి పైగా చల్లటి మజ్జిగ ను, పులిహోర పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విద్యార్థి సంఘం నాయకుడు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మైలవరం సబ్ బ్రాంచ్ సెక్రటరీ మరియు ట్రెజరర్ గూడూరు నాగి రెడ్డి విచ్చేసి మజ్జిగ, పులిహోర పంపిణీ ని చేశారు. మజ్జిగ పులిహోర పంపిణీ లో గ్రామస్తులు, ఆంజనేయ స్వామి భక్తులు విరివిగా పాల్గొని పులిహోరను స్వీకరించి మజ్జిగను సేవించడం జరిగింది. ఆర్టీసీ బస్సు లలో, ఆటోలలో ప్రయాణించే వారికీ, ద్విచక్ర వాహనదారులను, ఇతర ప్రయాణీకులను ఆపి మరి చల్లటి మజ్జిగను, పులిహోర ను అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి గారు మాట్లాడుతూ మేమందరం కలసి గత ఏడు సంవత్సరాలుగా ఈ సెంటర్ నందు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేసవి కాలం లో రోజు చల్లటి మంచి నీటి చలివేంద్రం తో పాటు దాతల సహకారంతో మజ్జిగను పంపిణీ ని చేస్తున్నామని చలివేంద్రం కోసం విరాళాలు అందించిన పూర్వ విద్యార్థులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటునట్లు తెలిపారు. పాపులమ్మ హై స్కూల్ నందు చదువుకున్న విద్యార్థులు అందరు కలసి ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసారు. మజ్జిగ పంపిణీకి ఆర్ధిక సహకారం అందించిన వెంకట శ్రీనివాస రెడ్డి, కృష్ణ వేణి దంపతులను విద్యార్థి సంఘ నాయకుడు నాగిరెడ్డి అభినందించారు. సంఘం తరుపున ఆవుల శ్రీను, వేముల సూరయ్య, గూడూరు మురళీకృష్ణా రెడ్డి, గూడూరు వేణు మాధవ రెడ్డి, సాంబయ్య, గ్రామస్తులు హాజరైనారు. (గూడూరు నాగిరెడ్డి) పూర్వపు విద్యార్ధి సంఘం నాయకుడు లకిరెడ్డి పాపులమ్మ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మైలవరం సబ్ బ్రాంచ్ సెక్రటరీ మరియు ట్రెజరర్