జర్నలిస్టుల హౌసింగ్ పై త్వరలోనే కార్యాచరణ :చంద్రబాబు జర్నలిస్ట్ పిల్లల ఫీజు రాయితిపై మీ జిల్లా కల్లెక్టర్లను కలవండి:విద్యాశాఖ మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబును,మంత్రి లోకే్ష్ ను కలసిన జర్నలిస్ట్ మిత్రులు విజయవాడ,జూన్ 13: జర్నలిస్టుల కు సొంత ఇంటికలను సాకారం చేసెందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.శుక్రవారం ఆయన నివాసంలో జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎ.వి.వి.శ్రీనివాసరావు, సినియర్ జర్నలిస్ట్ వల్లభనేని సురేష్ లు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశ అనంతరం వారిని కలవడం జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి తమ దృష్టిలో ఉందని త్వరలో కార్యాచరణ చేపడతామన్నారు.అనంతరం విధ్యా శాఖ మంత్రి లోకేష్ ను జర్నలిస్టుల పిల్లల ఫీజు 50% మినహాయింపు పై ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని సూచించారు. కలెక్టర్లతో మాట్లాడతనని అన్నారు. అక్కడే ఉన్న సమాచార కమీషనర్ హిమాన్ష్ శుక్ల ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగింది. అనంతరం జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

RJ7 MEDIA
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">