ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:- జాతీయస్థాయి మోడ్రన్ పెంటతలాన్ ఛాంపియన్షిప్ కు ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి నలుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ కృష్ణాజిల్లా ఇంచార్జ్, శిక్షకులు ధనియాల నాగరాజు సోమవారం నాడు పత్రికలకు తెలిపారు. జనవరి మూడు నాలుగు నాసిక్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు తలగడదీవి కుషాల్, కోట వర్షంత్, డి రాకేష్ ,కలవకొల్లు కింగ్ జార్జ్ లు అర్హత సాధించినట్లు నాగరాజు తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరైన నలుగురు ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర సెలక్షన్ కమిటీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు . ఈ క్రీడాకారులు మంగళవారంనాడు బయలుదేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు ధనియాల తెలిపారు. వీరు జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించి పథకాలతో తిరిగి రావాలని ఆయన కోరారు.