"ఆర్ జె 7 మీడియా మరియు శ్రీ మల్లికార్జున స్కూల్ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు" ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:- సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా శ్రీ మల్లికార్జున విద్యాసంస్థల ఆవరణలో శనివారం రాత్రి గన్నవరం నియోజకవర్గస్థాయి ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు గన్నవరం నియోజకవర్గం నలుమూల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఈ రంగవల్లి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు ప్రారంభమైన ఈ పోటీలు మరల మూడు గంటల 45 నిమిషాలకు అనగా గంటన్నర సేపు వ్యవధి సమయంలో మహిళలు రంగవల్లిలను అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. ఈ సంక్రాంతి సంబరాల్ని పురస్కరించుకొని శ్రీ మల్లికార్జున విద్యాసంస్థల ఆధ్వర్యంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా గొబ్బెమ్మలు, పాలపొంగళ్ళు, గంగిరెద్దులు ,హరిదాసుల పాటలు, కోడి పందాలు, భోగిమంటలను సాంప్రదాయపద్ధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ఆడపడుచులు పట్టు వస్త్రాలతో రమణీయంగా కార్యక్రమాన్ని రూపొందించారు పోటీలలో పాల్గొన్న విజేతల నుండి అత్యుత్తమ ముగ్గులు వేసిన మహిళలకు ప్రథమ స్థానం ఎం మాధవి( శ్రీనగర్ గన్నవరం) ద్వితీయ స్థానం పి. సాహితి (సూరంపల్లి) తృతీయ స్థానం దీప్సిక (గన్నవరం )అలాగే ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, అలాగే ప్రత్యేక అతిధిగా విచ్చేసిన రాజమండ్రి అడిషనల్ ఎస్పీ ఎన్.బి.ఎం మురళీకృష్ణ, గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు దేవినేని సులోచన ,గన్నవరం జడ్పీ సభ్యురాలు అన్నవరపు ఎలిజిబెత్ రాణి ,గన్నవరం మండలం మానవతా సేవా సమితి అధ్యక్షులు మడుపల్లి బాలకృష్ణ రావు, గొల్లపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లి సత్య జగదీశ్వరరావు, మల్లికార్జున హై స్కూల్ ప్రిన్సిపల్ నక్కిన మాధవి లత, ఆర్ జె 7 మీడియా చైర్మన్ కే .హరీష్ జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి డి నాగ ప్రత్యూష తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జాస్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా సంక్రాంతి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ మన తెలుగింటి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అడిషనల్ ఎస్పీ ఎన్ .బి .ఎం మురళీకృష్ణ మాట్లాడుతూ తెలుగంటి సాంప్రదాయాలను నేటి సమాజంలో ఇబ్బంది కలగని విధంగా నిర్వహించాలని ఆయన యువతను కోరారు.