"సబ్ జోన్ క్రీడలలో గన్నవరం హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ " ఈ నెల 24,25 తేదీలలో గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం లో జరిగిన గన్నవరం సబ్ జోన్ కీడలలో గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు నైపుణ్యం ప్రదర్శించి విజేతలు గా నిలిచారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి వి. రవి బాబు సోమవారం నాడు పత్రికలకు తెలిపారు.కాగా సీనియర్ బాలుర విభాగంలో ఖో ఖో ప్రధమ స్థానం, జూనియర్ ఖో ఖో ప్రధమ స్థానం, కబడ్డీ జూనియర్స్ విభాగం లో గన్నవరం, మరియు కేసరపల్లి సంయుక్త ప్రధమ స్థానం, షటిల్ బాడ్మింటన్ సీనియర్, జూనియర్ విభాగం లో ప్రధమ స్థానం, త్రో బాల్ సీనియర్ విభాగం ద్వితీయ స్థానం, సాఫ్ట్ బాల్ సీనియర్, జూనియర్ విభాగం లో పాఠశాల జట్లు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు రవి బాబు తెలిపారు. ప్రతిభ కనబరచి సెంట్రల్ జోన్ కు అర్హత సాధించిన విద్యార్థులను, వీరికి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన పాఠశాల వ్యాయమ విద్య సహాయకులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ ను అలాగే స్థానిక సాంఘీక సంక్షేమ వసతి గృహము విద్యార్ధులను ప్రోత్సహించిన వార్డెన్ యం.ఐ. ప్రకాష్ ను రవి బాబు తో పాటు పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు.

RJ7 MEDIA
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">