కూటమి ప్రభుత్వానికి అభివృద్ది కన్నా కక్ష సాధింపు చర్యలే ముఖ్యంగా ఉంది గన్నవరం జడ్పీటీసి అన్నవరపు ఎలిజబెత్ రాణి. ---------------------------------------- కూటమి ప్రభుత్వం గడిచిన ఏడు నెలలు కాలంలో వైస్సార్సీపీ నాయుకులు కార్యకర్తలుపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపులలో భాగంగానే జైలుకు పంపటమే వారికి టైమ్ సరిపోయింది అని గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి ఈ రోజు విజయవాడ జిల్లా జైలు నుండి వైస్సార్సీపీ నాయుకులు విడుదలైన సందర్భంగా వారిని ఓదారస్తూ అన్నారు. మీరు ఆధర్యా పడవద్దని మనకి మంచి రోజులు వస్తాయి అని చెపుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రెడ్ బుక్ డైరీ పాలన సాగుతున్నాట్లు ఉందన్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది,ప్రతి రోజు మహిళపై అత్యాచారాలు,మానభంగలు హత్యలు, జరుగుతూనే ఉన్నాయి అన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన పెన్సన్లు కూడా ఏదో ఒక సాకు తో రద్దు చేసే పనిలో ఉన్నారు అని,కరోనా టైంలో వాలంటరీలుగా ఎంతో కృషి చేసిన సేవను మేము ఉపయోగించు కుంటం వారికి మేము పదివేలు జీతం ఇస్తానని చంద్రబాబు గారు చెప్పి నేడు వారిని ఇంటికి పంపేసారు.విద్యుత్ చార్జీలు పెంచమని సంపద సృష్టిస్తామని చెప్పి,ఇప్పుడు బాదుడే బాదుడుగా ప్రజలపై భారం మోపుతున్నారు.అలాగే విద్యను పేదలకు దూరం చేయటానికి తెలుగు భాష పేరుతో ఇంగ్లీష్ మీడియం లేకుండా కుట్రతో పన్నాగాలు పన్నుతున్నారు అని అన్నారు.రైతులు పంటకు గిట్టుబాటు లేదు ఇస్తానన్న రైతు భరోసా లేదు.వీరి పరిపాలన నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన గత పుస్కారాలు గోదావరి నదిలో 23 మంది,మొన్నా తిరుపతి గుడి దగ్గర 6 గురు మరణింంచారు.చివరకు కూటమి నాయుకులు మట్టి తొలకంలో వాటాలు దగ్గర కొట్టుకుంటున్నవి పోలీస్ కేసులు వరకు వెళ్ళినది బహిరంగంగానే పత్రికలలో మీడియాలలో వార్తలు వస్తున్నాయి అన్నారు.అన్ని వర్గాల ప్రజలు అసంతృతి తో ఉన్నారు.మన మందరం శక్తీ వంచన లేకుండా ఈప్రభుత్వం లోపాల్నిప్రజలలోకితీసుకువెళదామని వారికి సూచించరు.

RJ7 MEDIA
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">