*పత్రికా ప్రచురణార్ధం* *విజయవాడ* *తేదీ: 08-01-2025* *కృష్ణానదీ యాజమాన్య బోర్డ్ (కె.ఆర్.ఎం.బి) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చెయ్యాలి* *నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలోని అన్ని సబ్ డివిజన్ లలో ఉన్న కాళీ స్థలాలలో రైతు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి* *విజయవాడలో జరిగిన నాగార్జునసాగర్ ఎడమకాలువ ప్రాజెక్ట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించిన డి.సి అధ్యక్షులు* ఉమ్మడి కృష్ణాజిల్లా నాగార్జునసాగర్ ఎడమకాలువ ప్రాజెక్టు కమిటీ సర్వసభ్య సమావేశం ఈరోజు ఉదయం విజయవాడ జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ కోట వీరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ కు కృష్ణానదీ యాజమాన్య బోర్డు డిశెంబరు, జనవరి మాసాలకు 12 టి.ఎం.సి లు నీటి విడుదల ఉత్తర్వులు ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం గత నెల రోజులుగా తాత్సారం చేసి నిన్ననే అరకొరగా 600 క్యూసెక్కులు విడుదల చేసిందని వీటిని 1,700 క్యూసెక్కులకు పెంచి మన ఆంధ్రా బోర్డరుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం గత రాష్ట్ర ప్రభుత్వం 2014-2019 కేంద్ర జలశక్తి శాఖ గత నిర్ణయం మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని, నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో అన్ని కాలువలకు సమగ్ర పర్యవేక్షణ కొరకు అవుట్ సోర్సింగ్ విధానంలో లస్కర్ లను ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టు కమిటీ పరిధిలోని అన్ని డివిజన్, సబ్ డివిజన్ క్రింద ఉన్న ఎన్.ఎస్.పి ప్రభుత్వ ఆస్తులను కాపాడుటకు చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు కమిటీ కాంపెటెంట్ అథారిటీ, విస్సన్నపేట పులిచింతల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు ఎస్.శ్రీరామకృష్ణ మాట్లాడుతూ జలవనరుల శాఖ అధికారులు నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ లు సమన్వయంతో పనిచేసి పైన తెలంగాణ నుంచి వచ్చే సాగర్ నీటిని వృధా కాకుండా ఆయకట్టు చివరి ప్రాంతానికి తీసుకువెళ్ళాలని సూచించారు. ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ నీటి సంఘాల ప్రతినిధులు రైతుల సౌకర్యార్థం నాగార్జునసాగర్ ఎడమకాలువ ప్రాజెక్టు కమిటీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి జలవనరుల శాఖ ఆవరణలో భవనం కేటాయించాలని, ప్రాజెక్టు కమిటీ పరిధిలో డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఖాళీగా వున్న స్థలాల్లో రైతు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లాపరిషత్ సమావేశంలో, డి.ఆర్.సి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనటానికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో అధికారులను కోరారు. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూటరీ ఛైర్మన్ లు మాట్లాడుతూ గత వై.సి.పి ప్రభుత్వంలో ఎడమ కాలువ పరిధిలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైందని కాలువల్లో ఉన్న కంప, పూడిక తొలగించి ఆయకట్టు చివరి ప్రాంతానికి సాగునీరు వెళ్ళటానికి చర్యలు తీసుకోవాలని, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులకు మండలపరిషత్ సమావేశాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా, నీటివినియోగదారుల సంఘాల అధ్యక్షులు గ్రామ పంచాయతీ సమావేశాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనటానికి చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఎన్.ఎస్.పి నూజివీడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.గోపినాధ్, జగ్గయ్యపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.సంతోష్, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

RJ7 MEDIA
0


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">