అగిరిపల్లి మండలం, అగిరిపల్లి గ్రామ గొల్లపల్లి విజయ కుమార్ గారి ఇల్లు విద్యుత్ఘాతానికి గురి అయ్యి పూర్తిగా కాలిపోవుట వల్ల రెడ్ క్రాస్ సొసైటీ తరపున చైర్మన్ శ్రీ వి.వి.కృష్ణారెడ్డి గారు పంపిన నిత్యావసర సామాన్లు ఈ రోజు తేది:10.11.2024 న శ్రీయుత తహసీల్దారు, అగిరిపల్లి వారి సమక్షములో పంపిణి చేయ్యటమైనది. ఈ పంపిణి కార్యక్రమములో డిప్యూటీ తహసిల్దారు శ్రీ జి.పవన్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ మహమ్మద్ యూనుస్, గ్రామ రెవిన్యూ అధికారి,అగిరిపల్లి వారు పాల్గొన్నారు.