*పార్టి కార్యకర్తలే టిడిపి కి బలం* *కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తోన్న ఏకైక పార్టీ తెలుగుదేశం* కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అండ అని గన్నవరం నియోజక వర్గ పరిశీలకులు హరిబాబు , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సోదరుడు యార్లగడ్డ సతీష్ లు అన్నారు . ఎమ్మల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అదేశాల మేరకు శనివారం గన్నవరం క్యాంపు కార్యాలయం నందు నాయకులతో కలసి టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు . రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ మద్దుకూరి విజయ్ కుమార్ ఆయన సతీమణి రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉప్పులూరి స్వర్ణకుమారి ఈచెరో లక్ష రూపాలయలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని స్వీకరించారు. అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్య పరిపాలన పరిడవిల్లుతుందని, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు విజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం వలన ఎన్నో కుటుంబాలకు ఎన్నో లాభాలు సమకూర్చబడుతుందని అన్నారు. కార్యకర్తలే టిడిపికి మహాభలం అన్నారు. సభ్యత్వంతో కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందే కార్యకర్తలకు 5 లక్షలు వరకు భీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. టీడీపీ సభ్యత్వం అత్యధికంగా నమోదు అయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.టిడిపి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు చిరుమామిళ్ల సూర్యం , ఆళ్ల గోపాల కృష్ణ , గుజ్జర్లపూడి బాబు రావు , గూడవల్లి నరసయ్య , గొడ్డళ్ల చినరామారావు , దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు , ఆరుమిళ్ల కృష్ణా రెడ్డి , జాస్తి శ్రీధర్ , బోడపాటి రవికుమార్ , మేడేపల్లి రమ , పలగాని బాలకృష్ణ , జూపల్లి సురేష్ , కూచిపూడి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు . అనారోగ్యంతో భాధ పడుతున్న బాపులపాడు మండలం కోడురుపాడు కు చెందిన తోట శ్రీలక్ష్మీ అనే మహిళ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన లక్ష రూపాయల చెక్కును అందజేశారు .