టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇటీవల యాపిల్ ఐఫోన్‌ల అమ్మకాలు పడిపోతుండటంతో సరికొత్త ఫీచర్లు, ఐడియాలతో ముందుకు రావాల్సిన ఒత్తిడిని కంపెనీ ఎదుర్కొంటోంది. యాపిల్ తన తాజా స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16కు కెమెరా బటన్‌ను డివైస్ బయట అమర్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో అత్యాధునిక సాంకేతికతను అందించే క్రమంలో ఈ మార్పు చేసినట్లు సంస్థ చెప్పింది. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ మాట్లాడుతూ ఈ తాజా నవీనకరణలు "స్మార్ట్‌ఫోన్ చేయగలిగే పనులకు ఉన్న హద్దులను చెరిపేస్తాయి’ అని చెప్పారు. కానీ ఇతర బ్రాండ్లు ఇప్పటికే తమ హ్యాండ్‌సెట్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ప్రవేశపెట్టడం వల్ల యాపిల్ గట్టిపోటీ ఎదుర్కొంటోంది.