ఆర్ జె 7 న్యూస్ కృష్ణాజిల్లా గన్నవరం :- గన్నవరం నియోజవర్గ కేంద్రమైన గన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నిడమర్తి నాగేశ్వరరావు, పార రామకృష్ణ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన కేకును కట్ చేసారు. అనంతరం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, చెప్పుల కుట్టుకునే కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. గన్నవరం ఎస్. సి కాలనీలో తల్లి వృద్ధాశ్రమం లోని వృద్దులకు ఒక్క పూట భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏంతో కృషి చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని అన్నారు.