*రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం పరిశ్రమల పెట్టుబడులే లక్ష్యంగా రెండు వారాలుగా అమెరికాలో పర్యటించి, విజయవంతంగా ముగించుకుని శనివారం(09.11.2024) సాయంత్రం కృష్ణా జిల్లా, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, యార్లగడ్డ వెంకట్రావు గారికి పుష్పగుచ్చం అందచేసి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈసందర్భంగా అమెరికాలో పలువురు పారిశ్రామికవేత్తలను, ఎన్నారైలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ-జనసేన-బీజేపీ ముఖ్యనేతలు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు/