*20.01.2025* *గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్* *రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం పై ఆరా* *గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం ను వంద పడకల ఆసుపత్రి గా తీర్చిదిద్దేందుకు చర్యలు* ఆర్ జె 7 న్యూస్ గన్నవరం:- గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం ను వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పై ఆరా తీశారు . రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, సిబ్బంది తీరు గురించి తెలుసుకున్నారు. అంతర్జాతీయ విమానశ్రమకు చెరువులో ఉన్న ఈ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా చేయాలని ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు . వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉందని అన్నారు. అవసరమైన మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనులను తక్షణమే చేయాలని ఆదేశించారు . ప్రజలకు రక్తపరీక్షలు చేయాలనీ తద్వారా విషజ్వరాలు, అతిసారం వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చునని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో పారశుధ్యాన్ని మెరుగుపరచాలని ఎలాంటి చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ సూచించారు.