ఆర్ జె సెవెన్ న్యూస్ ఏపీ :- మహా కుంభమేళాలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందా..? వీడియోల్లో నిజమెంత..? యూపీలో మహా కుంభమేళా కోలాహలంగా జరుగుతోంది. 12 ఏళ్లకు ఓసారి జరిగే ఈ మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ మహా కుంభమేళాలో పాల్గొని త్రివేణిం సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు కుప్పలుతెప్పలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే.. మహా కుంభమేళాలలోని ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా మహా కుంభమేళాకు చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనంతో కుంభమేళా కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో.. కుంభమేళాకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోలో నిజమెంతా..? Samayam Telugu మహా కుంభమేళా మహా కుంభమేళా క్లెయిమ్ యూపీలోని మహా కుంభమేళాలో ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. వాస్తవం. ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దావా తప్పు. మహా కుంభమేళాకు ముందు ఉత్తరప్రదేశ్ పోలీసుల అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది.. డిసెంబర్ 27, 2024న నిర్వహించిన మాక్ డ్రిల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మహా కుంభమేళా 2025 జనవరి 13న ప్రారంభం కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన మేళాలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఉత్తరప్రదేశ్‌కు తరలివస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ఈ మేళాలో.. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించటంతో సహా ఆధ్యాత్మిక వ్యవహారాల్లో మిలియన్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యాటకులు పాల్గొంటారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని నిర్వహించేందుకు విస్తృత సన్నాహాలు చేశారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు మౌలిక సదుపాయాలు, భద్రత మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో.. అలారం బెల్ మోగించడం, అగ్నిమాపక సామాగ్రితో పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తులు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న గందరగోళ దృశ్యాలను చూపించే వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహా కుంభమేళా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయని నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ఒక ట్విట్టర్ వినియోగదారు వీడియోను పంచుకుంటూ.. "మహాకుంభమేళా ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది" అని రాసుకొచ్చారు. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు అదే క్లెయిమ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. పోస్ట్‌లను (ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.) ఎలా నిర్ధారించామంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌పై వ్యాఖ్యలను సమీక్షించిన తర్వాత (ఇప్పుడు తొలగించబడింది).. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నిర్వహించిన మాక్ డ్రిల్‌ను చిత్రీకరించినట్టు కుంభమేళా పోలీసులు వివరణ కూడా ఇచ్చారు. వదంతులను వ్యాప్తి చేసినందుకు వినియోగదారుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ అగ్నిమాపక మరియు అత్యవసర సేవల ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. వైరల్ అవుతున్న వీడియో.. డిసెంబర్ 27, 2024న నిర్వహించిన మాక్ డ్రిల్‌కు సంబంధించినదిగా స్పష్టం చేశారు. మాక్ డ్రిల్‌కు సంబంధించిన చిత్రాన్ని కూడా షేర్ చేసింది. ఇదే క్రమంలో.. పుకార్లు వ్యాప్తి చేయోద్దని వినియోగదారులను పోలీసులు కోరారు. మహా కుంభమేళా, ప్రయాగ్‌రాజ్, సెంట్రల్ మెడికల్ పెరేడ్, సంగం నోస్, నాగవాసుకి ప్రాంతం, ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌తో సహా వివిధ కీలక ప్రదేశాలలో డ్రిల్ నిర్వహించినట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సమర్థవంతంగా నిర్వహించేందుకు సంసిద్ధతను పెంపొందించడం, మహా కుంభమేళా 2025 సందర్భంగా లక్షలాది మంది భక్తుల భద్రతను నిర్ధారించడటమే ఈ మాక్ డ్రిల్ లక్ష్యమని తెలిపారు. మాక్ డ్రిల్ వీడియో గురించి పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తులపై కుంభమేళా పోలీసుల ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసుల ఫ్యాక్ట్-చెక్ ఎక్స్ హ్యాండిల్ పేర్కొంది. కుంభమేళా పోలీసుల ఫైర్ మాక్ డ్రిల్ వీడియోలో ఉందని డీఐజీ వైభవ్ కృష్ణ కూడా ఒక పోస్ట్‌లో స్పష్టం చేశారు. నిరాధారమైన సమాచారాన్ని వ్యాప్తి చేసే వినియోగదారుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తీర్పు.. పైన పేర్కొన్న ఆధారాల మేరకు.. మహా కుంభమేళాలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నది పూర్తి అవాస్తవమని నిర్ధారణ అయ్యింది. ఎక్కడా కూడా మంటలు చెలరేగలేదని.. వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది కేవలం పోలీసులు మాక్ డ్రిల్ మాత్రమేనని తేలింది.