ఆర్ జె 7 స్పోర్ట్స్ న్యూస్ కృష్ణ :"ఈ నెల 26 న ఈడుపుగల్లులో మోడరన్ పెంటతలిన్ రాష్ట్ర జట్టు ఎంపిక" ఆంధ్రప్రదేశ్ మోడరన్ పెంటతలిన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 వ తేదీ ఉదయం 7 గంటలకు ఈడుపుగల్లు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్ వద్ద రెండవ విడత రాష్ట్ర స్థాయి స్త్రీ, పురుషుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంఘం కార్యనిర్వాహాక కార్యదర్శి డి. యన్. రాజు పత్రికలకు సోమవారం నాడు తెలిపారు.లాజర్ రన్, బైతలే,టైయతలే,టెట్రాతలిన్ తదితర క్రీడాంశాలలో ఎంపిక జరుగుతుందని ఆసక్తి కలిగిన వారు సమయం లోపు హాజరుకావాలని తెలిపారు.ప్రతిభ కనబరచిన ఉత్తమ క్రీడాకారులను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, పురుషుల జట్లను ఎంపిక చేసి జనవరి లో ఉత్తరాఖండ్ లో జరుగనున్న 2025 జాతీయ క్రీడలకు పంపడం జరుగుతుందని రాజు తెలిపారు. వివరాలకు 9490798909 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని ఆయన కోరారు.